CTR: చిత్తూరు జిల్లా విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం అదివారం సైతం విద్యుత్ శాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యధావిధిగా పనిచేస్తాయని తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్ఈలు సురేంద్రనాయుడు, ఇస్మాయిల్ అహ్మద్ ఒక ప్రకటనలో సంయుక్తంగా తెలిపారు. ఈ విషయాన్ని గమనించి, బిల్లులు చెల్లించి అపరాధ రుసుమును మినహాయించుకోవాలని సూచించారు.