KKD: సినీ నటి, మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణితో కలిసి గురువారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రోజాతో పాటు వైసీపీ నాయకులు ఉన్నారు.