ELR: ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన కోనే వీర వెంకట సత్యనారాయణకు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సందర్భంగా ఉత్తమ పురస్కార్ అవార్డును జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ విషయాన్ని సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డు రావడం పట్ల గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సత్యనారాయణను అభినందించారు.