ప్రకాశం: జిల్లాలో 2,85,438 మంది వివిధ రకాల పింఛన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.122.79 కోట్లను విడుదల చేసిందని కలెక్టర్ అన్సారియా చెప్పారు. ఈ నిధులు సోమవారమే సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేయనున్నారు. 31వ తేదీ ఉదయం 6 గంటలకు ముందే లబ్ధిదారులకు పంపిణీని ప్రారంభించనున్నారు.