VSP: విశాఖపట్నం జీవీఎంసీ జోన్-2 కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు కలకలం రేపాయి. జోన్ -2 కమిషనర్ సింహాచలంపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టినట్లు సమాచారం. ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటితోపాటు కార్యాలయం, బంధువులు ఇళ్లల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.