W.G: ఆకివీడు పాత బస్టాండ్ సెంటర్ నుంచి సిద్ధాపురం వెళ్లే మార్గంలో ఆక్రమణలను మంగళవారం అధికారులు తొలగించారు. ఇంఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సాకేత్ ఆధ్వర్యంలో ముస్లిం కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న తోపుడుబండ్లు, పలావ్ బండ్లను తొలగించారు. వీటి వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ సిబ్బంది ఈ చర్యలు చేపట్టారు.