ఎన్టీఆర్: చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామ పంచాయితీ ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుసుమ రాజు వీరమ్మ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకొని శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. తమ గ్రామానికి రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.