సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారి వెండి దండి శ్రీనివాస్ రెడ్డి, అర్చకులు కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోతోపాటు, తదితర అధికారులు పాల్గొన్నారు.