WNP: వీపనగండ్ల మండల కమిటీ సమావేశం పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి మండ్ల కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు హాజరై స్థానిక ఎన్నికల్లో సీపీఎం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు కదిలి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.