GNTR: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో బుధవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి చెందినవారు తమ సమస్యలను తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఫోన్ ద్వారా తెలిపారు. పార్టీ నాయకులు తలాటం సత్య, తిరుపతి అనూష, లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.