కృష్ణా జిల్లాలో సంక్రాంతి కోడిపందేలు రక్తసిక్తంగా మారుతున్నాయి. పందెంలో ఓడిన వేలకొద్దీ పందెపు కోళ్లు అక్కడికక్కడే బలైపోతున్నాయి. నిబంధనల ప్రకారం.. ఓడిన కోడిని గెలిచిన వారే దక్కించుకుంటుండటంతో, ఓడిపోయిన పందెం రాయుళ్లకు అటు పందెం సొమ్ముతో పాటు ఇటు కోడి మాంసం కూడా దక్కడం లేదు. బరుల వద్దే కోళ్ల పీకలు కోసి మాంసంగా విక్రయిస్తున్నారు.