PLD: భక్తి భావంతో ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి నూతనాలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. దాతలు శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు ఆదివారం ఇస్సపాలెంలోని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనుల నిమిత్తం తమ వంతు సహాయంగా రూ. 1,00,116ల నగదును ఆలయ కార్యనిర్వహణాధికారి మాధవిదేవికి అందజేశారు.