KDP: ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి త్వరలో శిక్షణ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ ఇస్తారు. కాగా, ఆదివారం ఎస్పీ అశోక్ కుమార్ ఈ సెంటరును తనిఖీ చేశారు. డీఎస్పీ అబ్దుల్‌కు పలు సూచనలు చేశారు. అనంతరం శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ తెలిపారు.