ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల(Ap Inter Results)ను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలు (Inter Exams) ముగిసిన 22 రోజులకే ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేశామని ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
మార్చి 15వ తేది నుంచి ఇంటర్ పరీక్షలు(Inter Exams) ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4వ తేదిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు ఎగ్జామ్స్కు 9,20,552 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదేవిధంగా వృత్తి విద్యాకోర్సులకు 83,749 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
ఫలితాల వివరాలు ఒకసారి చూసినట్లైతే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెకండియర్ లో 72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా 83 శాతం ఉత్తీర్ణతో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. విజయనగరం జిల్లా 57 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉందన్నారు. ఇంటర్ ఫలితాల(Ap Inter Results) కోసం examresults.ap.nic.in అనే వెబ్సైట్ లో లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు.