కోనసీమ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని అర్హత కలిగిన లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ వద్ద పీఎం సూర్యఘర్ పథకం అమలు తీరు పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తక్షణమే లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని అధికారులకు సూచించారు.