ASR: చింతపల్లి మేజర్ పంచాయితీలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వేణుగోపాల్ తెలిపారు. మేజర్ పంచాయతీ పరిధిలో 11కేవీ విద్యుత్ లైన్లలో పాత కండక్టర్ తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నేడు, ఉదయం 9నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.