VSP: సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో నెలగంట ఉత్సవాన్ని ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 1:01కు శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నట్లు ఆలయ సభ్యులు తెలిపారు. ఈ ధనుర్మాసంలో ఆలయంలో 10 రోజులు పగల్ పత్తు, మరో 10రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. మరో ఐదు రోజులు దారోత్సవాలు, ధనుర్మాసం సందర్భంగా నెలరోజులు తిరుప్పావై పాశురాల పఠనం చేస్తారన్నారు.