పల్నాడు: నరసరావుపేటలో జాతీయస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలు నిర్వహణ సంతోషమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. సోమవారం ఫ్లోర్ బాల్ పోటీలు నిర్వహిస్తున్న కే.రిడ్జ్ పాఠశాలను సందర్శించారు. క్రీడాకారులతో కలిసి ఫ్లోర్ బాల్ ఆడారు. నరసరావుపేట జాతీయ క్రీడా పోటీలకు వేదికగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశ ప్రతిష్ఠతను పెంచాలని క్రీడాకారులకు సూచించారు.