ప్రకాశం: మార్కాపురం మండలంలోని ఇడుపూరు గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని శివాలయం ఆలయం వద్ద ఉన్న సింగల్ ఫేస్ మోటార్ పది రోజులుగా మరమ్మతులకు నోచుకోక పోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోయారు. గ్రామ పంచాయతీ అధికారులు బోర్‌కు మరమ్మతులు చేయించి తాగునీటి ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.