కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని నున్న వికాస్ కాలేజ్‌లో ఈ నెల 10న ఉద్యోగ మేళా జరగనుందని కళాశాల ఛైర్మన్ నర్సిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాకు మైక్రోసాఫ్ట్, హోండా, టాటా టెక్నాలజీస్, లాయిడ్స్, ఓమెగా హెల్త్‌కేర్ తదితర 19 ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. 3 వేల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నయని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.