ASR: హుకుంపేట మండలం ములియపుట్టు పంచాయతీ, బొర్రగొంది గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమైంది. కొత్త స్తంభాలు వేసి మూడు నెలలు గడుస్తున్నా, ఇంకా తుప్పు పట్టి కూలేలా ఉన్న పాత ఇనుప స్తంభాల నుంచే ప్రమాదకరంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. పెను ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి, వెంటనే కొత్త స్తంభాలకు లైన్లు మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.