కృష్ణా: గుడివాడ -విజయవాడ ప్రధాన రహదారిలో గల బేతవోలు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం గత కొంతకాలంగా వెనుకకు వాలిపోయి ఉండటంతో ప్రజలు అంబేద్కర్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. బేతవోలు సెంటర్ అనగానే గుర్తుకు వచ్చే ఈ విగ్రహానికి ఆనుకుని కాలువ ఉండటంతో ఈ విగ్రహం రోజురోజుకీ వెనుకకు వాలిపోయి దర్శనమిస్తుంది.