కృష్ణా: నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం సమీపంలో అవనిగడ్డ రోడ్డుపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వ్యక్తి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటా హుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.