VZM: గంట్యాడ మండలం, నరవ గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాలు ఆదివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వాంచారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మెచ్చి ప్రజలు టీడీపీలో చేరుతున్నారన్నారు.