సత్యసాయి: మడకశిర సరిహద్దు నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రెండు గ్రానైట్ లారీలను విజిలెన్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన లారీలను మడకశిర పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సీఐ సుబ్రమణ్యం తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఖనిజ సంపదను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.