కృష్ణ: జగ్గయ్యపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో అక్టోబర్ 23న జిల్లా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు దాసరి శ్రీనివాస్, ఎమ్ శ్రీనివాస్‌లు తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14,17 బాల, బాలికలకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు ఎంట్రీ ఫామ్‌తో హాజరుకావాలన్నారు.