ప్రకాశం: వైసీపీ ప్రభుత్వంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటిలకు ఉన్న అధికారాలను స్థానిక సంస్థలకు అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రాచారి హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనిర్ణయం వల్ల స్థానిక సంస్థలకు అధికారాలను కాపాడటంతో పాటు ఆదాయం పెరుగుతుందన్నారు.