VZM: జిల్లాలో ఎవరైనా పశువుల అక్రమ రవాణకు పాల్పడితే, చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం హెచ్చరించారు. పశువులను అక్రమ రవాణకు పాల్పడుతున్న వారిపై గత వారం రోజుల్లో 11 కేసులు నమోదు చేసి, 12 మందిని అరెస్టు చేయడంతో పాటు, 11 వాహనాలను, 189 పశువులను సీజ్ చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు.