WG: సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేసే వారు విద్యుత్ తీగల వద్ద అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఈఈ కె. మధు కుమార్ హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులు ట్రాన్స్ ఫార్మర్లు, కరెంటు లైన్ల సమీపంలో గాలిపటాలు ఎగురవేయడం ప్రమాదకరమని పేర్కొన్నారు. మాంజా తీగలు విద్యుత్ లైన్లకు తగిలితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని, తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలని కోరారు.