సత్యసాయి: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సత్యసాయి జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు షాన్వాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో పుట్టపర్తి అసెంబ్లీ ఇంఛార్జ్ మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై ఆమెతో చర్చించారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు.