కడప: ప్రొద్దుటూరు స్థానిక మనోజీరావు వీధి, శంకర్ రావు వీధి, శ్రీరాముల పేటలలో బీజేపీ సభ్యత్వ నమోదు ఆదివారం చేపట్టారు. 13వ వార్డు బీజేపీ ఇంఛార్జి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ సభ్యత్వ నమోదు చేసుకున్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర కోశాధికారి సీవీ. జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.