ASR: అనంతగిరి మండలం టోకూరు పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి సూకూరు అప్పలకొండమ్మ మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కే.రాజశేఖర్ సోమవారం ఆరోపించారు. విద్యార్థిని అనారోగ్యానికి గురైనపుడు యాజమాన్యం, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఇందుకు కారణమైన హెచ్ఎం, వార్డెన్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.