PLD: కొండవీడు ఘాట్ రోడ్డు ఆదివారం నుండి తెరుచుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండవీడు ఘాట్ రోడ్లో విరిగిపడిన కొండ రాళ్లను అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సూచనలతో జిల్లా ఫారెస్ట్ అధికారి, ఆర్అండ్బి అధికారుల సమన్వయంతో ఆదివారం నుండి సందర్శకులను అనుమతిస్తున్నట్లు జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు తెలిపారు.