కోనసీమ: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కోరారు. ఇందులో భాగంగా సోమవారం రాజోలు సీహెచ్సీలో శానిటరీ వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే సందర్శించారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు. దీన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు.