కోనసీమ: కోనసీమ కొబ్బరికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. కొబ్బరికాయల ధర భారీగా పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ధర రెట్టింపు అయ్యింది. మార్కెట్లో మంగళవారం వెయ్యి కొబ్బరికాయల ధర రూ.9 వేల నుంచి రూ.20 వేలకు చేరింది. దసరా, దీపావళి ముందున్నందున అప్పటికి ఈ ధర రూ.20 వేలకు చేరొచ్చని రైతులు, వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.