ChatGPT: ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence) అద్భుతాలలో చాట్‌జీపీటీ(ChatGPT) ఒకటి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఔత్సాహికుల కోసం చాట్‌జీపీటీ (ChatGPT) ఆండ్రాయిడ్ యాప్ సేవలు భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఐఫోన్ (IOS) యూజర్లకు ఈ మొబైల్ అప్లికేషన్‌ను పరిచయం చేయగా, నిన్న రాత్రి నుంచి ఆండ్రాయిడ్ వినియోగదారులకూ కూడా ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్ వెబ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ టెక్నాలాజీ ఇప్పుడు చేతులోకి వచ్చేసింది. భారత్‌తో పాటు అమెరికా, బంగ్లాదేశ్, బ్రెజిల్ దేశాల్లో ఈ సేవలు ప్రారంభించినట్లు ఓపెన్ ఏఐ (OpenAI) తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. రాబోవు రోజుల్లో ఈ సేవలు మరిన్ని దేశాలకు విస్తరించేలా ప్రణళికలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇది ముందు ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల నుంచి అద్బుతమైన ప్రతిస్పందన రావడం, అదే సమయంలో ఆండ్రాయిడ్ యూజర్లు కూడా కోరడంతో చాట్‌జీపీటీ సేవలను తాజాగా వీరికి కూడా అందించింది.
ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్(Google Play Store) ద్వారా డౌన్లోడ్ చేసుకునీ ఈ సేవలు పొందవచ్చు. అయితే ఇందులో వాయిస్ సెర్చింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండడంతో చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇక మనం అడిగిన వాటికి సమాధానాలు ఇస్తుంది. కావాలంటే సలహాలు కూడా ఇస్తుంది. ఇది వరకే దీన్ని వెబ్‌లో వాడిన వారికి తెలుసు ఎన్ని సదుపాయాలు ఉన్నాయో. అలాగే చాట్ హిస్టరీ, డేటా ఎక్స్పోర్ట్ ఆప్షన్లను అందిస్తోంది. అయితే ఐఫోన్లో అందించే ప్లగిన్ వంటి కొన్ని ఫీచర్లను మాత్రం ఇంకా ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి తీసుకురాలేదు. త్వరలోనే ఇవి కూడా యాడ్ చేస్తామని ఓపెన్ ఏఐ తెలిపింది.
వివిధ డొమైన్లను విస్తరించటం, కంటెంట్ జనరేషన్, కోడింగ్ అసిస్టెంట్, పుస్తక సారాంశాలను అందించటంతో పాటు, కథలు రాయడం, కవిత్యాలు చెప్పడం, మీరు ఏ ప్రశ్న అడిగినా చాట్‌జీపీటీ ఇట్టే ఆన్సర్లు అందిస్తుంది. AI చాట్‌బాట్ మల్టీటాస్కింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో దీన్ని ఉపయోగించేందుకు నెటిజన్లు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటియే లక్షలాది మంది ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. దీనిలో త్వరగా సమాధానం చెప్పడం, తగిన సలహాలు ఇవ్వడం, ఏదైన వినూత్నమైన విషయాలను నేర్చుకోవడం వంటివి అందుబాటులో ఉన్నావి.