SKLM: మాజీ మంత్రి గుండ.అప్పలసూర్యనాయణ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇవాళ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు మాలలు వేసి నివాళులర్పించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన మాజీ మంత్రి మృతి జిల్లా రాజకీయాల్లో తీరని లోటు అని ఆయన అన్నారు.