WPLలో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ఘన విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన యూపీ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. హర్లీన్ డియోల్ (64*), లిచ్‌ఫీల్డ్ (25), మెగ్ లానింగ్ (25), ట్రయాన్ (27*) రన్స్ చేశారు. ముంబై బౌలర్లలో బ్రంట్ 2, అమీలియా 1 వికెట్ పడగొట్టారు.