KNR: మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎల్ఎండీ ఎస్సై తెలిపారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి చెందిన దయ్యాల ప్రశాంత్ (28) నుస్తులాపూర్లోని సొసైటీ పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడు. ఇటీవల పెళ్లి సంబంధాలు వచ్చినా, ఏదీ కుదరకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన ప్రశాంత్ పురుగుమందు తాగాడు. నాలుగు రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.