SRCL: పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో అర్హులైన 21 మంది లబ్ధిదారులకు రూ. 7.91 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు.