NDL: పట్టణంలోని సంజీవ్నగర్ రామాలయంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కూడారై (పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం) సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకం చేశారు. లక్ష తులసి అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భగవత్ సేవా, సమాజ్ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.