MDK: సీఐటీయూ, కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక కర్షక పోరుయాత్ర ఆటో జాత రామాయంపేటకు చేరుకుంది. ఈ నెల 8వ తేదీన జిల్లా కేంద్రంలో ప్రారంభమైన పోరు యాత్ర ఆదివారం రామాయంపేట మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాల నాయకులు ఈ పోరు యాత్రలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.