E.G: సంక్రాంతి సమీపిస్తుండటంతో రాజమండ్రి మార్కెట్లో చికెన్, మటన్ ధరలకు రెక్కలు వచ్చాయి. కేజీ స్కిన్లెస్ చికెన్ ధర రూ. 300కు చేరగా, స్కిన్‌తో కలిపి రూ. 280గా ఉంది. ఇక లైవ్ కోడి రూ. 200 వరకు పలుకుతోంది. మరోవైపు మటన్ ధర కేజీ రూ.1000కి చేరింది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, పండుగ వేళ ఈ భారం సామాన్యులకు ఇబ్బందిగా మారింది.