పెద్దపల్లి: ధర్మారం మండలంలో చైనా మాంజా విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. చైనా మాంజా అమ్మకాలపై ప్రత్యేక బృందాలతో దుకాణాలు, గోదాములు, మార్కెట్లలో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. చైనా మాంజా అమ్మకం, నిల్వ చేయడం నిషేధమని, వ్యాపారులు గమనించాలని సూచించారు.