AP: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం నాన్ సెజ్‌లోని SVS కెమెకల్స్ కంపెనీపై కేసు నమోదైంది. ఇటీవల ఎస్వీఎస్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ కేసు నమోదు చేశారు. పరిశ్రమల శాఖ అధికారుల నుంచి ఫిర్యాదు తీసుకుని కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని హోంమంత్రి అనిత పోలీసులను ఆదేశించారు.