HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ సంపత్ కుమార్ అన్నారు. పరకాల 1వ వార్డు పరిధిలోని బొడ్రాయి, ముస్లిం, రజక వాడలలో చేపడుతున్న శానిటేషన్ పనులను సంపత్ కుమార్ పరిశీలించి సిబ్బందికి పని సూచనలను చేశారు.