AP: శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు పీఎస్ వద్ద పోలీసులు చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఈశ్వరప్ప అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ వివాహితను గూడూరు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై ఆమె భర్త హరి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, గూడూరు నుంచి వాళ్లిద్దరిని పోలీసులు తనకల్లు తీసుకొచ్చారు. పోలీసు జీపు దిగిన వెంటనే ఈశ్వరప్పను హరి, అతని బంధువులు కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు.