NLG: మిర్యాలగూడ టౌన్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 11గంటలకు నిర్వహించే సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు తప్పక హాజరు కావాలని కోరారు.