అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయిన నికిత రావు.. మేరీల్యాండ్‌లోని తన మాజీ బాయ్‌ఫ్రెండ్ అర్జున్‌శర్మ అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉంది. నికిత కనిపించడం లేదని జనవరి 2న అర్జున్ పోలీసులను ఆశ్రయించాడు. అర్జున్ అదేరోజు భారత్‌కు వచ్చాడు. పోలీసులు నికిత డెడ్ బాడీని గుర్తించి, అర్జున్‌పై కేసు నమోదు చేశారు.