AP: భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ విజయవంతమైంది. ‘అల్లూరి సీతారామరాజు’ పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ విమానాశ్రయం ఇప్పుడు శరవేగంగా వాస్తవ రూపం దాల్చుతోంది. త్వరలో విమానాశ్రయానికి కూటమి ప్రభుత్వం అధికారికంగా ‘అల్లూరి’ పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది.